తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేసింది.?' - Bandi Sanjay Comments on KCR

Bandi Sanjay Comments on KCR: గద్వాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. చండూరు క్రాస్ రోడ్డు నుంచి వల్లూరు వరకు 13 కి.మీ మేర యాత్ర కొనసాగుతోంది. యాత్రలో మాట్లాడిన బండి సంజయ్.. తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు.

bandi sanjay
బండి సంజయ్

By

Published : Apr 17, 2022, 1:02 PM IST

Bandi Sanjay Comments on KCR: కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. గద్వాల జిల్లాలో నాలుగో రోజు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్‌కు... ఆయన నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. చండూరు క్రాస్‌ నుంచి వల్లూరు వరకు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BJP Praja Sangrama Yatra: పేదలకు ఇళ్లు లేక.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక.. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం వల్ల.. కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసిందని.. రాష్ట్రంలో ఒక్కొక్కరి పేరిట రూ. లక్ష అప్పుందని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేదని బండి సంజయ్ ఆరోపించారు.

"కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులు మాత్రం అలాగే ఉండిపోయారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేసింది.? ప్రధాని మోదీ ఛాయ్‌ అమ్మిన వ్యక్తి కాబట్టే ఆయనకు పేదల సమస్యలు తెలుసు. అందుకే పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

భాజపా ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్

ఇవీ చదవండి:పేద విద్యార్థులకు హరీశ్‌రావు అండ.. ఎంబీబీఎస్​ చదివేందుకు చేయూత..

సినిమా థియేటర్లో మంటలు- క్షణాల్లోనే..

ABOUT THE AUTHOR

...view details