తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడే పుట్టిన శిశువుకు దంతాలు! - latest news of jogulambha

చిన్నారులకు ఏడాది లేదా రెండేళ్లకు పాల దంతాలు ఏర్పడటం చూశాం.. కానీ జోగులాంబ గద్వాల జిల్లా అప్పుడే పుట్టిన చిన్నారికి పళ్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా! నిజమండీ పుట్టుకతోనే ఆ చిన్నారి రెండు పళ్లతో జన్మించింది ఆ కథేంటో చూద్దామా.

baby born with teeth in jogulambha
పుట్టుకతోనే పళ్లతో జన్మించిన శిశువు!

By

Published : Jul 9, 2020, 2:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని లలిత మెటర్నిటీ హాస్పిటల్లో గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన సుచరిత తన రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు శస్త్ర చికిత్స​ చేసి పాపకు బయటకు తీశారు.

కాగా చిన్నారి హార్ట్​బీట్​ను పరిశీలిస్తుండగా నోటిలో రెండు పళ్లు ఉన్నాయని గుర్తించారు. పుట్టకతోనే రెండు పళ్లు ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు.

ఇవీచూడండి:కూల్చివేత వేగవంతం... జూన్ 2 వరకు కొత్త సచివాలయం

ABOUT THE AUTHOR

...view details