జోగులాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు పొరుగు గ్రామంలో పనికి వెళ్లారు. పని ముగిశాక తిరుగు ప్రయాణంలో ఆటోలో బయలుదేరారు. గ్రామ సమీపానికి చేరుకోగానే ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కొత్తపల్లిలో ఆటో బోల్తా, ఐదుగురికి గాయాలు
కూలీ పని చేసుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా కొత్తపల్లి గ్రామ సమీపంలో వారి వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కొత్తపల్లిలో ఆటో బోల్తా, ఇద్దరికి తీవ్రగాయాలు
డ్రైవరు వేగంగా వెళ్తుండగా... గమనించి మెల్లగా తీసుకెళ్లమని చెప్పినా కూడా వినిపించుకోలేదని అందుకే ఈ ప్రమాదం జరిగిందని కూలీలు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
ఇవీ చూడండి:కాల్వలోకి ద్విచక్ర వాహనం... గల్లంతైన భార్య