జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఉండవెల్లి శివారు వాగులో ఆటో గల్లంతైంది. ఉండవెల్లి మండలంలో రాత్రి భారీ వర్షానికి గ్రామశివారులోని వాగు పొంగి పొర్లింది. అదే గ్రామానికి చెందిన దేవరాజు ఆటోలో నలుగురు ప్రయాణికులతో వాగు దాటుతుండగా నీటిలో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న వారు చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. గ్రామస్థులంతా కలిసి ఆటోను బయటికి తీశారు.
వాగులో కొట్టుకుపోయిన ఆటో - auto
వాగులో గల్లంతైన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి శివారులో జరిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది.
![వాగులో కొట్టుకుపోయిన ఆటో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3503548-thumbnail-3x2-jogulamba-auto.jpg)
వాగులో ఆటో