తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాల జలాశయంలో కొట్టుకుపోతున్న యువకుని వీడియో వైరల్ - an youngster lost in jurala dam in gadwal district

వారం రోజులపాటు కురిసిన వర్షాలతో జలకళను సంతరించుకున్న జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

an youngster lost in jurala dam in gadwal district
జూరాల జలాశయంలో కొట్టుకుపోతున్న యువకుని వీడియో వైరల్

By

Published : Aug 24, 2020, 1:37 PM IST

Updated : Aug 24, 2020, 1:55 PM IST

జూరాల జలాశయంలో కొట్టుకుపోతున్న యువకుని వీడియో వైరల్

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. జలాశయ సందర్శనకు మహబూబ్​నగర్ నుంచి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. జిల్లా కేంద్రంలోని న్యూమోతీ నగర్​కు చెందిన కృష్ణ తన స్నేహితుడు రఘు, అతని భార్యతో కలిసి జలాశయ సందర్శనకు వచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం, జలాశయ నీటి సవ్వళ్లతో మైమరిచిపోతున్న సందర్శకులు.. ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోతున్న కృష్ణను చూసి షాకయ్యారు. కృష్ణ వెంట వచ్చిన స్నేహితుడు, అతని భార్య ఎవరికీ వివరాలు చెప్పకుండా మహబూబ్​నగర్​కు వెళ్లిపోయారు. కృష్ణ తల్లిదండ్రులు రఘును నిలదీయగా.. విషయం బయటపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే కృష్ణ బంధువులు అమరచింత పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అతను నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృష్ణ వీడియో చూసి.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరదాగా జలాశయ సందర్శనకు వెళ్దామనుకుంటే సరైన భద్రత ఉండటంలేదని మండిపడుతున్నారు. మరోవైపు ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసినా... తమ కళ్లుగప్పి కొందరు నీటిలో దిగి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

Last Updated : Aug 24, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details