జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల లాక్‌డౌన్‌ను పటిష్టంగా కొనసాగిస్తున్నామని ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తున్నామని వివరించారు.
లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ - లాక్డౌన్ కఠినంగా అమలు
గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. లాక్డౌన్ ఈనెల 30 వరకు పొడిగించినందున ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిత్యావసరాలు వారి ఇళ్లకే పంపిస్తున్నామన్నారు.

లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ
దిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వారు మొత్తం 51 మంది ఉన్నారని, వారు ఎవరితో తిరిగారనే పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్‌కు అందించామన్నారు. రాష్ట్ర సరిహద్దులు కర్నూల్, రాయచూర్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆ నిర్వహణను జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణకు అప్పగించమన్నారు. లాక్డౌన్ ఈనెల 30 వరకు పొడిగించడం జరిగిందని, అందుకూ ప్రజలందరూ సహకరించాలని కోరారు.
లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ
ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ బ్రెయిన్‌డెడ్