జోగులాంబ గద్వాల జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. గద్వాలలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
వైద్య కళాశాల కోసం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం - అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అఖిలపక్షం నాయకులు
గద్వాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అఖిలపక్షం నాయకులు
ఉమ్మడి రాష్ట్ర పాలకుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలు స్వరాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడుతున్నామని అఖిలపక్షనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళిక స్వరూపం ఆధారంగా గద్వాల ప్రాంతం వైద్య కళాశాలకు అనుకూలంగా ఉందంటూ సర్వేలు చేయించిన నాయకులు ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు.
ఇదీ చదవండి:TPCC: పీసీసీ అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమన్నారంటే!