జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను హంస వాహనంపై ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొని రాగా... రథానికి సంప్రదాయ పూజలు నిర్వహించారు. భక్తులు పురవీధుల గుండా రథాన్ని లాగారు.
వైభవంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం - Telangana news
అలంపూర్‌లో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. అర్చకులు సంప్రదాయ పూజలు నిర్వహించగా... భక్తులు పురవీధుల్లో రథాన్ని లాగారు.

రథాన్ని లాగుతున్న భక్తులు
అలంపూర్ పురవీధులు శివనామస్మరణతో మారుమోగాయి. ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ప్రేమ్ కుమార్, ఆలయ ఛైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్, పుర ఛైర్పర్సన్ మనోరమ పాల్గొన్నారు.
ఇదీచదవండి:కేటీఆర్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ