తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ఆడపడుచులు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి' - Batukamma sarees distribution in Alampur

తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు కట్టుకుని ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ పట్టణంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Alampur mla abraham
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

By

Published : Oct 10, 2020, 4:55 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలంపూర్ పురపాలికలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్​పర్సన్ మనోరమ, ఎంఆర్​ఓ మదన్​మోహన్​తో కలిసి ఎమ్మెల్యే అబ్రహం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

పండుగ పూట రాష్ట్ర ఆడపడుచులంతా కొత్త చీరలు కట్టుకుని సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. కరోనా కష్టకాలంలోనూ తెరాస సర్కార్​ కోటి చీరలను తయారు చేయించిందని తెలిపారు. అలంపూర్ మండలంలో10వేల 248 చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలంతా సమీపంలోని రేషన్ దుకాణాల్లో బతుకమ్మ చీరలు తీసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details