రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం జోగులాంబ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సారి ప్రత్యేకంగా మహబూబ్నగర్ నుంచి వెంకటేశ్వర సేవాదళ్, శిరిడి సాయి సేవాదళ్ సభ్యులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఈ లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టేది. సేవాదళ్ సభ్యులు పాల్గొనటం వల్ల ఒకే రోజు పూర్తయినట్లు ఆలయ ఈవో వెంకటాచారి వెల్లడించారు. ఈ విధానాన్ని ప్రతి లెక్కింపుకు కొనసాగిస్తామని తెలియజేశారు. మొత్తం రూ. 31లక్షల 61వేల 244రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే 48గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి, 12అమెరికన్ డాలర్లు, మలేషియన్ డాలర్ కానుకలుగా వచ్చినట్లు చెప్పారు.
జోగులాంబ అమ్మ వారి హుండీ లెక్కింపు - Alampur jogulamba Temple Hundi calculated by devotes
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. 31లక్షల 61వేలకు పైగా నగదు, 48 గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.
![జోగులాంబ అమ్మ వారి హుండీ లెక్కింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3701194-1042-3701194-1561820614703.jpg)
జోగులాంబ అమ్మ వారి హుండీ లెక్కింపు