తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారు' - trs activists are distributing money to voters in alampur

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు.

aicc secreatary sampath kumar fires on trs as trs activists are distributing money to voters
'పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారు'

By

Published : Jan 21, 2020, 9:09 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తెరాస నాయకులు బ్యాలెట్ పేపర్​ను చూపుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ విమర్శించారు. దాదాపు 2లక్షలకు పైగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొని పోలీస్ స్టేషన్​లో అప్పగించారని తెలిపారు.

మూడు మున్సిపాలిటీలలోని కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని వార్డుల్లో కొత్త వ్యక్తులు తిరుగుతున్నట్లు కనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలంపూర్ పట్టణంలోని 8వ వార్డులో ఊట్కూరు గ్రామానికి చెందిన తెరాస నాయకుడు నర్సన్ గౌడ్​ రూ.50 వేలు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొని వెళ్లిన శివ అనే వ్యక్తిపై పోలీసులు తిరిగి కేసు పెట్టారని సంపత్‌కుమార్‌ మండిపడ్డారు.

పోలీసు, ఎన్నికల అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెరాస నైతికంగా ఓడిపోయి.. ఇలా విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సంపత్‌కుమార్‌ విమర్శిచారు.

'పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details