రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా వేములలో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగు తన కలల ప్రాజెక్ట్‌గా మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు నా కలల ప్రాజెక్టు: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో 7 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు తన కలల ప్రాజెక్టుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో 249 మండలాల్లోని పొలాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచించారని మంత్రి వివరించారు. విడతల వారీగా సుమారు ఏడు లక్షల హెక్టార్లలో పంట సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు... దానికి అవసరమైన సబ్సిడీలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శృతి ఓఝా, ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'