తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమె చావుకు భర్తే కారణం..మృతదేహంతో ధర్నా - After 15 days of fighting death, She finally died

జోగులంబ గద్వాల జిల్లా శాంతినగర్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మహిళ తనువు చాలించింది. ఇందుకు భర్తే కారణమంటూ.. మృతదేహంతో సహా బంధువులు ధర్నాకు దిగారు.

after-15-days-of-fighting-death-she-finally-died

By

Published : Jul 23, 2019, 3:15 PM IST

జోగులాంబ గద్వాల శాంతినగర్​కు చెందిన పరిమళ 15 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది. తమ కూతురి మృతికి భర్త శేఖర్ కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో సహా శేఖర్​ ఇంటి ముందుకు ధర్నాకు దిగారు.

మూడేళ్ల క్రితం పెళ్లైన పరిమళ, శేఖర్​ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని... కూల్​డ్రింక్​లో పురుగుల మందు కలిపి బలవంతంగా తాగించారని బంధువులు చెబుతున్నారు.

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 15 రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న పరిమళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు భర్తతోపాటు అత్తమామలు పరారీలో ఉన్నాట్లు తెలిపారు.

మృతదేహంతో ధర్నా

ఇవీ చూడండి: ఈటీవీ భారత్‌ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details