జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి వ్యవసాయ విస్తరణ అధికారిగా ప్రకాష్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు రైతులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వీరు ఏటా రైతుబంధు డబ్బులు అడగడం లేదని గుర్తించిన ఏఈఓ ఆ డబ్బు స్వాహా చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకులో రైతు ఖాతాకు బదులు తన ఖాతాను జతపరిచి ఉన్నతాధికారులకు పంపించారు.
రైతుబంధు నిధులు స్వాహా... ఏఈఓ సస్పెండ్ - AEO Prakash Suspended latest news
అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కూడా అధికారులు వదలడం లేదు. పొట్టకూటి కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లిన రైతుల నిధులను తమ సొంత ఖాతాలోకి మళ్లీంచుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి వేల రూపాయల నిధులను మెక్కేశారు.

రైతుబంధు నిధులు స్వాహా... ఏఈఓ సస్పెండ్
ఐదు మంది రైతులకు చెందిన రూ.58,852 సొంత ఖాతాలోకి మళ్లీంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చిన అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. పాలనాధికారి ఆదేశంతో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టగా సదరు ఏఈఓ కావాలనే ఖాతా నంబర్ ఇచ్చినట్లు తేల్చారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు