jagapathi babu: సినీ నటుడు జగపతి బాబు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల బ్రెయిన్ డెడ్ అయి.. అవయవదానం చేసిన చరిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగపతి బాబు మాట్లాడారు. అన్నదానం కన్న అవయవదానం మిన్న అని పేర్కొన్నారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా తాను చనిపోయిన తర్వాత అవయవదానం చేయడానికి అంగీకరించినట్లు జగపతి బాబు తెలిపారు.
చరిత కుటుంబ సభ్యులకు సినీ నటుడు జగపతి బాబు పరామర్శ - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు
jagapathi babu: జోగులాంబ జిల్లా కేంద్రంలో ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన చరిత కుటుంబ సభ్యులను సినీ నటుడు జగపతి బాబు పరామర్శించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు.
![చరిత కుటుంబ సభ్యులకు సినీ నటుడు జగపతి బాబు పరామర్శ జగపతిబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15761589-48-15761589-1657191278096.jpg)
జగపతిబాబు
ఇదీ చదవండి: తనువు చాలించి.. నలుగురికి ప్రాణదాతగా నిలిచిన చరిత
Last Updated : Jul 7, 2022, 6:51 PM IST