జోగులాంబ గద్వాలలోని అలంపూర్ చౌరస్తాలోని ఓ ఇంట్లో ఈ నెల 16న ఓ దొంగ చోరీకి ప్రయత్నించాడు. పక్కింటివాళ్లు ఇది గమనించి చాకచక్యంగా ఆలోచించారు. దుండగుడు దూరిన ఇంటికి బయటి నుంచి తాళం వేశారు. కానీ వెనుకవైపు ఉన్న తలుపు నుంచి బయటపడిన దొంగ చెట్టెక్కగా.... స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు రోజులు పోలీస్స్టేషన్లోనే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున కానిస్టేబుళ్లు నిద్రలో ఉండడాన్ని గమనించి తెలివిగా తప్పించుకున్నాడు. అది కూడా పోలీసు వాహనంలోనే పరారయ్యాడు. ఆ వాహనాన్ని తక్షశిల వద్ద వదిలివెళ్లాడు. ఆ దొంగ వాహనాల చోరీలో ఆరితేరినవాడని... హైదరాబాద్లో మెకానిక్ షెడ్డు నిర్వహిస్తున్నాడని సమాచారం.
వీడు మామూలు దొంగ కాదు.. పోలీస్ జీపులోనే పరార్! - A THIEF CAUGHT BY POLICE AND ESCAPED IN POLICE JEEP
ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఈ క్రమంలో జనానికి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల చేతిలో పడ్డాడు. రెండురోజులు ఠాణాలో ఉన్న ఆ దొంగ... పోలీసుల కళ్లుగప్పి ఏకంగా వారి వాహనంలోనే పరారయ్యాడు. సినిమాల్లో మాత్రమే చూసే ఇలాంటి సన్నివేశం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.
A THIEF CAUGHT BY POLICE AND ESCAPED IN POLICE JEEP
Last Updated : Sep 20, 2019, 1:21 PM IST