తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి - ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి వార్తలు మల్దకల్​

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్దకల్​కు చెందిన జాహ్నవి రెండో కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు సిజేరియన్ చేసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

By

Published : Oct 5, 2020, 11:31 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నాగరాజు, జాహ్నవి దంపతులకు మొదటి సంతానము మగ బిడ్డ జన్మించింది. నాలుగేళ్ల తర్వాత రెండో కాన్పు కోసం కర్నూలు యశోద నర్సింగ్ హోమ్​కి వెళ్లగా అక్కడ వైద్యులు సిజేరియన్​ చేసి ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ముగ్గురు పిల్లలతో వైద్య సిబ్బంది, బంధువులు

ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు కాగా.. ఒక మగ పిల్లాడు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటనగా భావిస్తున్నారు.

ఇదీ చదవండి:వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు

ABOUT THE AUTHOR

...view details