Dog Race in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో కుక్కల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. భవానీమాత ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగాయి. ఏపీ, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన కుక్కలు పరుగు పందెంలో పాల్గొన్నాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల కుక్కలు పరుగులు పెట్టాయి.
Dog Race in Gadwal : డాగ్ రేస్.. ఆ ఊళ్లో కుక్కలు 'పరుగో పరుగు' - Dogs Running Competitions in Gadwala District
Dog Race in Gadwal : చుట్టూ జనం.. ఒకటే అరుపులు.. కమాన్ కమాన్ అంటూ చప్పట్లు.. ఒక్కసారిగా కుక్కలు పరుగో పరుగు అంటూ ఉరకడం మొదలుపెట్టాయి. జనం చప్పట్లు కొడుతూ వాటిని ఉత్సాహపరుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో పరుగు పందెంలా అనిపిస్తోంది కదూ. అనిపించడం కాదు పరుగు పందెమే. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో భవానీ మాత ఉత్సవాల సందర్భంగా కుక్కల పరుగు పందెం నిర్వహించారు.
![Dog Race in Gadwal : డాగ్ రేస్.. ఆ ఊళ్లో కుక్కలు 'పరుగో పరుగు' Dog Race in Gadwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16942027-298-16942027-1668579348349.jpg)
Dog Race in Gadwal
ఆ ఊళ్లో కుక్కలు పరుగో పరుగు
ఇందులో జెస్సీబాయి (ఇందువాసి), దేవ రాజులబండ (కర్ణాటక), రాణి రాయచూరు (కర్ణాటక), వెంకటేశ (బల్గేర) చెందిన కుక్కలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ బహుమతులకు ఎంపికయ్యాయి. వారికి వరసగా రూ.8 వేలు, 6వేలు, 4వేలు, 2వేల రూపాయాల చొప్పున బహుమతులను అందజేశారు. ఈ పోటీలను వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఆసక్తిగా చూశారు.
ఇవీ చదవండి: