తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగులో వంద గొర్రెలు గల్లంతు... - Heavy rains in Jogulamba Gadwala District

జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటిక్యాల సమీపంలోని పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల వాగులో సుమారు వందకు పైగా గొర్రెలు కొట్టుకుపోయాయి.

100 sheep were washed away in Itikala pond in Jogulamba Gadwala district
వాగులో వందకుపైగా కొట్టుకుపోయిన గొర్రెలు

By

Published : Oct 12, 2020, 10:31 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్​లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో వందకుపైగా గొర్రెలు కొట్టుకుపోయాయి. జిల్లాలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటిక్యల మండలం మానవపాడులో భారీ వర్షాలకు పత్తి, మిరప పంటలన్నీ నీట మునిగాయి.

వాగులో వందకుపైగా కొట్టుకుపోయిన గొర్రెలు

ఇటిక్యాల సమీపంలోని పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల వాగులో సుమారు వందకు పైగా గొర్రెలు కొట్టుకుపోయాయి. వాగు సమీపంలో వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, దామోదర్, అయ్యన్న, చిన్నయ్య గొర్రెల కాపరులు. సుమారు 400పైగా గొర్రెలను పొలంలో కంచె వేసి మేపుకుంటున్నారు. తెల్లవారుజామున వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా రావడంతో నిద్రలో ఉన్న కాపరులు లేచి చూసేసరికి గొర్రెలు నీటమునిగాయి. కంచె తీసి ఒడ్డుకు తోలుతున్న సమయంలో వాగు ఉద్ధృతికి సుమారు వందకు పైగా గొర్రెలు కొట్టుకుపోయాయని తెలిపారు. గొర్రెలే తమకు జీవనాధారం వాగులో గొర్రెలు కొట్టుకు పోవడంతో ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details