తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 9:37 PM IST

ETV Bharat / state

జడ్పీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు తెరాస, కాంగ్రెస్​ నాయకులు ఒకరిని ఒకరు పిలుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

zp meeting in jayashankar bhupalpally district
రసాభాసగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా జడ్పీ సమావేశం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్​లో జిల్లా జడ్పీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ జక్కు శ్రీ హర్షిని పాల్గొన్నారు. జిల్లాలోని సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్జానిక ప్రతినిధులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినప్పుడు ఒకరిని ఒకరు పిలుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, కాంగ్రెస్​ నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకున్నారు. దీనిపై జడ్పీ ఛైర్​పర్సన్​ జక్కు శ్రీ హర్షిని ఆగ్రహంగా బయటికి వెళ్లు అంటూ ప్రతిపక్షనాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లు అనే మాటపై అందరూ అవాక్కయ్యారు. కాసేపట్లో సమావేశం రసాభాసగా మారింది.

పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ పుట్ట మధుకర్​ వచ్చి జయశంకర్ జిల్లాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడమేంటని కాంగ్రెస్​ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై కొద్దిసేపు సభ రసాభాసగా మారింది. ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని శాఖల అధికారుల పనితీరును జడ్పీ ఛైర్​పర్సన్​, కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: అన్నదాత ఆత్మహత్య కేసులో తహసీల్దార్, వీఆర్వో సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details