తెరాస ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలపై కాకతీయ యూనివర్సిటీలో చర్చకు రావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమావేశం నిర్వహించారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాలు చేస్తే వారిని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు.
నిరుద్యోగులను మోసం చేస్తున్నారు : రాణిరుద్రమ - ప్రభుత్వంపై రాణిరుద్రమ విమర్శలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆమె పర్యటించారు.
ఉపాధ్యాయుల పోస్తులు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతునై ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్న నన్ను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో అందరికి న్యాయం జరుగుతోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి తెరాసలో విలువ లేదని మండిపడ్డారు. పార్టీలో రెండు వర్గాలుగా పరిపాలన జరుగుతోందని అన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులు, నాయకులు, ఉపాధ్యాయులు, యువకులు, కార్మికులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆదరించాలని రాణిరుద్రమ విజ్ఞప్తి చేశారు.