ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలలో ఏదేని ఒక దానితో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. గుర్తింపు కార్డును చూసిన అనంతరమే ఓటు వేయడానికి అనుమతిస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఓటర్లకు సూచించారు.
'ధ్రువీకరణ పత్రాలతో.. పోలింగ్ కేంద్రానికి వెళ్లండి'
ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని.. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఓటర్లకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో.. గుర్తింపు కార్డును చూసిన అనంతరమే ఓటు వేయడానికి అనుమతిస్తారని గుర్తుచేశారు.
'ధ్రువీకరణ పత్రాలతో.. పోలింగ్ కేంద్రానికి వెళ్లండి'
ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్, సంబంధిత అధికారులు జారీ చేసిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం.. వీటిల్లో ఏదైనా ఒక దానిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చని కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి:'ఉద్యోగ, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'