తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవినీతిని పాతరేయ్​.. అభివృద్ధికి బాటలు వేయ్​'

జయశంకర భూపాలపల్లి జిల్లాలోని నవాబుపేట గ్రామంలో గ్రామపంచాయతీ వేదికగా ప్రజలతో కలిసి పంచాయతీ బృంద సభ్యులు నేను అవినీతికి వ్యతిరేకం అంటూ ప్రతిజ్ఞ చేశారు.

By

Published : Dec 9, 2019, 8:00 PM IST

world-anti-corruption-day-celebrated-in-jayashankar-bhupalapalli
'అవినీతిని పాతరేయ్​.. అభివృద్ధికి బాటలు వేయ్​'

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. నవాబుపేట గ్రామంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదికగా గ్రామపంచాయతీ బృందం నేను అవినీతికి వ్యతిరేకం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ అధికారులు ఏ పని చేయాలన్నా లంచాలు ఇవ్వనిదే ఫైల్ కదలడం లేదని.. ప్రభుత్వ కార్యాలయాలను అవినీతి కబళిస్తోందని సర్పంచ్​ సాయిసుధ అన్నారు.
అవినీతిని నిర్మూలించేందుకు నా వంతు కృషి చేస్తానని, నిబద్ధతతో ప్రజలలో చైతన్యం తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశారు. అవినీతిని పాతరేయ్.. అభివృద్ధికి బాటలు వెయ్ అని సర్పంచ్ సాయిసుధ పిలుపునిచ్చారు.

'అవినీతిని పాతరేయ్​.. అభివృద్ధికి బాటలు వేయ్​'

ABOUT THE AUTHOR

...view details