జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజు 4 కి.మీ అటవీ నడక కార్యక్రమాన్ని భూపాలపల్లి రేంజ్ కమలపూర్ నార్త్ బీట్‌లో నిర్వహించారు. అడవిలోని చెట్లు, జంతువుల ప్రాముఖ్యతను డీఎఫ్‌వో పురుషోత్తం వివరించారు. వన్యప్రాణి వారోత్సవాల ముగింపు వేడుకను గురువారం ఉదయం 9గంటలకు ప్రకృతి భవనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్పర్సన్లు హాజరై బహుమతులు ప్రదానం చేయనున్నారు.
వన్యప్రాణి వారోత్సవాలు: 4కి.మీ అటవీ నడక - వన్యప్రాణి వారోత్సవాలు లేటెస్ట్ న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజు 4 కి.మీ అటవీ నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. చెట్లు, జంతువుల ప్రాముఖ్యతను డీఎఫ్‌వో పురుషోత్తం వివరించారు. ముగింపు వేడుక ప్రకృతి భవన్లో గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో పాములపై అవగాహన ప్రదర్శన, వన్యప్రాణుల ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తప్పక హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో పురుషోత్తం, ఎఫ్ఆర్వో రేణుక, ఎఫ్ఎస్వో రాజేష్, సుమన్, సంతోశ్, సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ శ్రీనివాస్ కాసెట్టి, నారాయణ కాలేజ్ యాజమాన్యం, ప్రభుత్వ టీచర్లు, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ సెక్రటరీ శ్యాం సుందర్, రవిబాబు, సాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెరాస, భాజపా ఒక తాను ముక్కలే: గూడూరు