పాండవుల గుట్టను త్వరలో అంతర్జాతీయ స్థాయిలో మెగా బొటానికల్ గార్డెన్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.ఎ అక్బర్‌తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత జయలో భాగంగా మొక్కలు నాటారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం..
చారిత్రాత్మక ప్రాధాన్యం గల పాండవుల గుట్టకు ట్రెక్కింగ్ కోసం ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని.. ఇక్కడికి వచ్చే పర్యటకులు 2,3 రోజులు ఇక్కడే బస చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగానే ఉన్నందున పర్యటకులు విశేషంగా వస్తారన్నారు. మౌంటెన్ ట్రెక్కింగ్‌తో పాటు నైట్ క్యాంపింగ్, బోటింగ్, రిసార్ట్స్, కాటేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.