తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 5:35 PM IST

ETV Bharat / state

రోడ్డు పక్కన వాటర్ ఫౌంటేన్ ప్రత్యక్షమయింది..!

కేటీపీపీ పైప్ లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దాదాపు గంటపాటు నీరు వృథాగా పోయింది. సమాచారం అందుకున్న అధికారులు నీటి తరలింపును నిలిపివేశారు.

Breaking News

పైప్ లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అది చూడ్డానికి అచ్చం వాటర్ ఫౌంటేన్​లానే కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న కేటీపీపీ పైప్ లైన్ లీకవగా కనిపించిన దృశ్యం అది. లీకైన నీరు ఉవ్వెత్తున ఎగిసిపడి వాటర్ ఫౌంటేన్​ను తలపించింది. రహదారి వెంట ఏరులై పారింది. దాదాపు గంటపాటు నీరు వృథాగా పోయింది. సమాచారం అందుకున్న అధికారులు నీటి తరలింపును నిలిపివేశారు.

రోడ్డు పక్కన వాటర్ ఫౌంటేన్ ప్రత్యక్షమయింది

ఇంతకీ ఈ వాటర్​ లైన్​ ఏంటి..?

గణపురం మండలం చెల్పూర్ లోని జెన్కో కేటీపీపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తరలించేందుకు దాదాపు 60 కిలోమీటర్ల ప్రత్యేక పైపులైను వేశారు. ఆ పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. అదే పైపు లైన్ లీక్ అయ్యింది.

ఇదీ చూడండి: ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details