జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం కిసన్‌రావుపల్లి అటవీ ప్రాంతంలో స్థానికులు పెద్దపులి అడుగులు గుర్తించారు. అటవీశాఖకు సమాచారం అందించడంతో అధికారులు పెద్ద పులి అడుగులుగా నిర్ధారించారు.
రెండు రోజుల క్రితం యమన్‌పల్లి గ్రామ శివారులో పులి అడుగులు కనిపించిన ఘటన మరువకముందే కిషన్‌రావుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
భూపాలపల్లి మండలం అజాంనగర్ గ్రామం నుంచి యామనపల్లి దారిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే పరిసర ప్రాంత ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని అధికారులు తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే అటవీశాఖ 9440810090 నంబర్‌కు లేదా... 18004255364 టోల్ ఫ్రీ నంబర్‌కు గాని తెలిపాలని సూచించారు.
17 ఏళ్ల తర్వాత భూపాలపల్లి అడవుల్లో పులి రాక చాలా గొప్ప విషయమని తెలిపారు. అందరూ స్వాగతించి సహకరించాలని అన్నారు. ఎటువంటి వేట, కరెంట్ తీగలు అమార్చుట నేరమని హెచ్చరించారు.
జయశంకర్ జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా