జనత కర్ఫ్యూ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు గస్తీ కాస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెనపై 24 గంటల పాటు పోలీసులు రాకపోకలను నిషేధించారు. కర్ఫ్యూలో భాగంగా ప్రజలు స్వీయ నియంత్రణలో ప్రజలుండగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
లక్ష్మి బారేజీపై రాకపోకలు నిషేధం
జనతా కర్ఫ్యూలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీపై రాకపోకలను నిషేధించారు. సీఆర్పీఎఫ్ బలగాలు 24 గంటలపాటు అక్కడ గస్తీ నిర్వహిస్తున్నాయి.
లక్ష్మి బారేజీపై రాకపోకలు నిషేధం
మహారాష్ట్రలో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఆ ప్రాంతాల గుండా రాష్ట్రంలోకి జరిగే రాకపోకలను నిషేధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమేల, మలహార్, మహమత్తారం, కాటరం మనడలలో ప్రజలు స్వచ్ఛందంగా, స్వీయ నియంత్రణ లో ఉన్నారు.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'