జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో బ్రహ్మంగారు చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయంటున్నారు గ్రామస్థులు. ఇంతకి ఆ వింత ఏంటి అనుకుంటున్నారా.... స్థానికంగా నివాసముండే మల్లారెడ్డి తన ఇంటి ఆవరణలో ఆరు మామిడి చెట్లను పదేళ్ల క్రితం నాటాడు. ప్రతి ఉగాదికి మామిడికాయలు కాస్తూ ఉన్నాయి. వీటిలో ఒక చెట్టు మాత్రం మళ్లీ కాపు కాసింది. గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి కాయలను చూసేందుకు అందరూ ఎగబడుతున్నారు.
కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి - కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి
మామిడి పళ్లు సాధరణంగా వేసవికాలంలో కాస్తాయి. కానీ జయంశంకర్ భూపాలపల్లిలోని లక్ష్మారెడ్డి గ్రామంలో ఓ మామిడి చెట్టుకు గుత్తుగుత్తులుగా కాయలు కాస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి