తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2020, 11:37 PM IST

ETV Bharat / state

సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు

ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు సాగుతోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 2 కేంద్రాలు, 60 వార్డులు ఏకగ్రీవం కాగా... సుమారు అన్నింటినీ తెరాస కైవసం చేసుకుంది.

UNANIMOUS IN JAYASHANKER BHUPALAPALLY PACS ELECTIONS
UNANIMOUS IN JAYASHANKER BHUPALAPALLY PACS ELECTIONS

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం పరిధిలోని 10 కేంద్రాలలో 2 కేంద్రాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్కో కేంద్రానికి 10 వార్డుల చొప్పున 130 ఉండగా.. 60 వార్డుల డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గణపూర్, చెల్పూర్ కేంద్రాల్లో 13 మందికి 13 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 8 కేంద్రాలలో రేగొండ మండల కేంద్రంలో 10 మంది, జంగెడులో 10 మంది, చిట్యాలలో 9 మంది, మొగుల్లపల్లిలో 4 మంది, ఘనపూర్ 13 మంది, చెల్పూర్​లో 13 మంది, మహాదేవ్​పూర్​లో ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 70 మంది డైరెక్టర్లు పోటీలో ఉన్నారు. కాటారం, మహముత్తరాం, మలహార్ మండలాల్లో ఏకగ్రీవాలేమి జరగలేదు. ఘనపూర్ మండలంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్​ బ్లాక్ పార్టీ, తెరాస... చెరో సంఘం పంచుకొని చెల్పూర్, ఘనపూర్ కేంద్రాల్లో ఏకగ్రీవం చేసుకున్నారు.

సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు

ఇదీ చూడండి:వేడుకలో పరిచయం.. వంచించి సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details