పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని... తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సింగరేణి కార్యాలయ ఉద్యోగులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం చెల్పూర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించండి: పల్లా - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని... తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సింగరేణి జీఎం నిరీక్షన్రాజ్ను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల పరిధిలో ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించండి: పల్లా
సింగరేణి జీఎం నిరీక్షన్రాజ్కు కర పత్రాన్ని అందించి తనకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట ఎంపీ పసునూరి దయాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, దివ్యాంగుల రాష్ట్ర ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మంత్రులకు నిరసన సెగ... సమ్మేళనంలో సర్పంచ్ల పంచాయితీ!
TAGGED:
telangana latest news