ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జీ కె. రాజయ్య పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో.. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
'పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం' - జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో.. ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జీ కె. రాజయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
'పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం'
రాజకీయ అవగాహన లేని వారూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న రాజయ్య.. వారి వల్ల గ్రాడ్యుయేట్స్‌కు సరైన న్యాయం జరగదని అన్నారు. ఆలోచించి తెరాస అభ్యర్థికే ఓటు వేయాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇచ్చే క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిందని వివరించారు.
ఇదీ చదవండి:మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు