తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టభద్రుల ఎన్నికల్లో తెరాసను గెలిపించుకోవాలి' - చెల్పూరు కేటీపీపీ జెన్కోలో తెరాస నేతల ప్రచారం

నల్గొండ, ఖమ్మం, వరంగల్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చెల్పూర్​ కేటీపీపీ జెన్కోలో తెరాస నేతలు ప్రచారం నిర్వహించారు.

mlc elections campaign, ktpp genco
కేటీపీపీ జెన్కో, ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Jan 23, 2021, 12:15 PM IST

శాసన మండలి ఎన్నికల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ జెన్కోలో విద్యావంతులను, ఉద్యోగులను ఉద్దేశించి తెరాస నేతలు ప్రచారం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు.

ప్రచారంలో వరంగల్​ ఎంపీ పసునూరి దయాకర్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి: బండి

ABOUT THE AUTHOR

...view details