కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని వరుస క్రమంలో ఉన్న ఒకటో పంపుకు ఈరోజు ఇంజినీర్లు ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక్కో పంపుకు సుమారుగా 12 సార్లు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. 231 ఆర్పీఎంలో పంపు రన్ అయితే విజయవంతమైనట్లు భావిస్తారు. ఈ క్రమంలో ఒకటో పంపుకు చివరి రన్ నిర్వహించడం ద్వారా భారీగా గ్రావిటీలోకి గోదావరి జలాలు చేరాయి. ట్రయల్ రన్ సుమారుగా ముప్పావుగంట జరిగింది. పంప్‌ల ద్వారా చేరిన నీరు గ్రావిటీ కెనాల్ గుండా ప్రవహించి అన్నారం బ్యారెజీకి చేరింది.
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్ - Trail run at kannepally
తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని నిల్వ చేసి ఎత్తిపోసేందుకు సిద్ధం అవుతోంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని వరుస క్రమంలో ఉన్న ఒకటో పంపుకు ఈరోజు ఇంజినీర్లు ట్రయల్ రన్ నిర్వహించారు.
![కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3750975-thumbnail-3x2-mdfj.jpg)
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్