జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును డీజీపీ మహేందర్‌రెడ్డి సందర్శించారు. ఈనెల 21న జరిగే ప్రారంభోత్సవానికి భద్రతా పరమైన చర్యలు చేపట్టేందుకు ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్, ఐజీ నాగిరెడ్డితో కలిసి డీజీపీ సమీక్షించారు. ప్రారంభోత్సవ వేదిక, యాగశాల, ఇతర భద్రతా అంశాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నర్ రానుండటం వల్ల పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నాతాధికారులకు సూచించారు.
'కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పటిష్ఠ బందోబస్తు ' - STATE GOVERNMENT
ఈ నెల 21న భుపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించి భారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు