తెలంగాణ

telangana

ETV Bharat / state

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి.. బస్సు ఎదురుగా వచ్చి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి కమలాపూర్- బాంబుల గడ్డ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఆమార్గంలో వచ్చిన బస్సులోని ప్రయాణికులు చూశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 26, 2022, 2:42 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో మంచిర్యాల నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కమలాపూర్- బాంబుల గడ్డ వద్దకు రాగానే పులి రోడ్డు దాటుతూ కన్పించింది. గమనించిన బస్సు డ్రైవర్ రమేశ్ బస్సును ఆపాడు. ప్రయాణికులు సైతం పులిని చూశారు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి భయాందోళనకు లోనవటం వల్ల ఎవరు ఫొటోలు తీయలేకపోయామని ప్రయాణికులు తెలిపారు.

అయితే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎటువైపు వెళ్తుంది..? ఎన్ని రోజులుగా జిల్లా అడవుల్లో సంచరిస్తుందనే విషయాలు తేలాల్సి ఉంది. పాదముద్రల ఆధారంగా బెబ్బులి సంచరించినట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ అనవాళ్లతో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి కలకలం

ABOUT THE AUTHOR

...view details