తెలంగాణ

telangana

ETV Bharat / state

Three Orphaned Children: అమ్మానాన్న లేరు.. ఆపదలో ఉన్నాం.. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండయ్యా - three orphaned children

Three Children Became Orphans: అంత బాగానే ఉంది అనుకునే సరికి అమ్మ బలవన్మరణానికి పాల్పడింది. కనీసం నాన్న అయినా తోడుగా ఉన్నాడనుకుంటే ఆయన కొన్నాళ్లకే అనారోగ్యంతో మృతి చెందాడు. నిజ జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు.. నిమిషాలలోనే మన జీవితం తారుమారైపోతుంది. నా అనుకున్న వారిని కూడా కొల్పోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు జీవించడం అంటే అది నరకం కంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది. అప్పటి వరకు అల్లారుముద్దుగా పెరిగి నాన్న గుండెల మీద ఆడుకుని, అమ్మ చేతి గోరు మద్దలు తీని ఆహ్లాదంగా గడిపిన చిన్నారులు.. వారు లేక పోయే సరికి ఒక్కసారిగా అనాథలైపోయారు.

Three Orphaned Children
Three Orphaned Children

By

Published : Apr 26, 2023, 11:47 AM IST

Three Children Became Orphans: తప్పులు చేస్తే తిట్టే నాన్న, వాటిని కప్పిబుచ్చే అమ్మ లేక వారు నానా అవస్థలు పడే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు చదువుకుంటున్న ఈ ముగ్గురు పిల్లల జీవితాల్లో అదో మలుపు. ఇప్పుడు నా అన్నవారు లేక.. నిలువ నీడ లేక ఓ గుడారం వేసుకుని జీవిస్తున్నారు. చదువుకునే మార్గం లేక కూలీ పనులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. ఎప్పటికైనా వారి జీవితం మారబోదా అని.. అన్నాచెల్లెళ్లు ఇద్దరు కూలీ పనులకి వెళ్తూ తమ తమ్ముడిని చదివించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన పిట్లల బాపు, అనంత దంపతులు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారి పేర్లు పిట్టల రాజ్‌కుమార్‌(16), రష్మిత(15), రంజిత్‌(12). బాపు, అనంత దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అలాగే వచ్చిన దానిలోనే సర్ధుకుంటూ పిల్లల్ని చదివించుకునేవారు. వారికి ముగ్గురు పిల్లలు. కుటుంబం పెద్దది అయ్యే సరికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవి. దీంతో ఎనిమిదేళ్ల కిందట అనంత.. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు.

తల్లిదండ్రుల మరణంలో దిక్కుతోచని స్థితిలో చిన్నారులు: భార్య చనిపోయినా అలాగే గుండె నిబ్బరం చేసుకుని.. బాపు కుటుంబ భారాన్ని మోస్తూ వస్తున్నారు. పిల్లలను సాకుతున్న బాపు మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యారు. కరోనా కాలంలో వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. అప్పటికీ రాజ్​కుమార్ 8వ తరగతి, రష్మిత 5వ తరగతి చదువుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వారు చదువు మధ్యలోనే మానేసి కూలీ పనులకు వెల్లాల్సి వచ్చింది. ఆ ఇరువురు కూలీ పనులు పనులు చేసి కుటుంబాన్ని భారాన్ని భుజంమీద వేసుకుని నెట్టుకొచ్చారు. మూడోవాడైన రంజిత్​ను గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు.

ప్రస్తుతం అతడు 6వ తరగతి పూర్తి చేశాడు. మంచాన పడిన తండ్రి బాగోగులు చూసుకుంటూ.. ఓ పూట తిని, మరోపూట తినక పస్తులుండేవారు. ఈ నేపథ్యంలోనే బాపు (42) ఆరోగ్యం క్షీణించి నెల రోజులు కిందట మృతి చెందారు. దీంతో ఆ పిల్లల పరిస్థితి సందిగ్ధంలో పడ్డారు. వారికి ఉండడానికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఇంటి పై కప్పు ఓ వైపు కూలిపోవడంతో.. తండ్రి మరణించాక పిల్లలు ఇల్లు విడిచి, చిన్న గుడారం వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. బంధువులు ఉన్నా గానీ, పేదరికంతో వారు సాయం చేయలేని పరిస్థితి. 'ఆపదలో ఉన్నాం.. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని' ఆ పసి హృదయాలు వేడుకుంటున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details