జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో... పిడుగుపాటుకు 40 పాడి గేదెలు, ముగ్గురు పశువుల కాపరులు మరణించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 వేలు అందించారు.
పిడుగుపాటు మృతులకు ఎమ్మెల్యే పరామర్శ.. ఆర్థిక సాయం - టేకుమట్లలో పశువుల మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో పిడుగుపాటుకు మృతి చెందిన ముగ్గురు పశువుల కాపరుల కటుంబాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 చొప్పున ఆర్థిక సాయంఅందించారు.
పిడుగుపాటు మృతులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతి చెందిన 40 పశువులకు కూడా నష్ట పరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మృతదేహాలకు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు.
ఇదీ చూడండి:పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి