తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సేవ చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి ఈటల - జయశంకర్ భూపాలపల్లి వార్తలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా విశ్రాంత అడిషనల్ ఎస్పీ కట్టంగూరి రాం నరసింహారెడ్డి.. పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ఈటల.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

minister etala
మంత్రి ఈటల

By

Published : Apr 1, 2021, 5:55 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఆకినపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన.. విశ్రాంత అడిషనల్ ఎస్పీ కట్టంగూరి రాం నరసింహారెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరసింహారెడ్డి దంపతులను.. ఘనంగా సత్కరించారు.

కేఎస్​ఆర్​ ట్రస్ట్​ ద్వారా నరసింహారెడ్డి చేపడుతోన్న పలు సేవా కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. పదవి విరమణ అనంతరం కూడా ప్రజల మధ్యలో ఉండి.. సేవలు అందించాలని ఆయన కోరారు. ప్రజలకు సేవ చేయాలనే మంచి మనసున్న మనిషి.. రాజకీయాల్లోకి రావాలని సూచించారు.

ఇదీ చదవండి:విధి నిర్వహణలో ఏఎస్​ఐ మృతి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details