జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పలు గ్రామాలలో పర్యటించారు. భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట, ఘనపూర్ మండలంలోని గాంధీనగర్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
రెండో విడత పల్లె ప్రగతి... కలెక్టర్ పర్యవేక్షణ
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పలు గ్రామాలలో అధికారులతో కలిసి పరిశీలించారు. పల్లె ప్రగతిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో కలిసి పనిచేయాలని సూచించారు.
రెండో విడత పల్లె ప్రగతి కలెక్టర్ పర్యవేక్షణ
నిరక్షరాస్యుల వివరాల నమోదు కార్యక్రమంలో అధికారులతో కలిసి పరిశీలించారు. రెండో విడత పల్లె ప్రగతి ఈరోజు నుంచి 10 రోజుల పాటు జరగనుందని తెలిపారు. పల్లె ప్రగతిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో పనిచేసి పల్లెలను, పచ్చదనం, పరిశుభ్రంగా, ఉంచుకొవాలని సూచించారు. జిల్లాలో నిరక్షరాస్యత తగ్గించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం