జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సైకత లింగాలకు, గోదావరి నది మాతకు పూజలు చేశారు. కాళేశ్వర-ముక్తీశ్వరా స్వామి వార్ల దర్శనాలు చేసుకుని తరిస్తున్నారు. సాయంత్రం 4గంటల 26నిమిషాలకు ముక్తీశ్వరా శుభా నందా దేవిలకు కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రాత్రి 12.00 లకు మహా అభిషేకం, లింగోద్భవ పూజ శాస్త్రోక్తంగా జరిపిస్తారు.
కాళేశ్వరంలో భక్తుల సందడి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు - kaaleshwaram
శివరాత్రిని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
కాళేశ్వరంలో భక్తుల సందండి