పట్టణంలోని జవహర్నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయం భవనం శ్లాబ్.. శనివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.. మిగతా ఆరుగురు కార్మికులు తప్పించుకున్నారు. క్షతగాత్రులను హన్మకొండలోని ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం శ్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. నూతన భవన శ్లాబ్ కూలిపోయిన దృశ్యం.. వీరి పనితనం ఎలా ఉందో చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిర్మాణ దశలోనే కూలిన పోలీసు కార్యాలయం - bhupalapalli news
భూపాలపల్లిలోని జవహర్నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయం భవనం శ్లాబ్ కుప్పకూలింది. శ్లాబ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
![నిర్మాణ దశలోనే కూలిన పోలీసు కార్యాలయం The downed police office slab in bhupalapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7609565-382-7609565-1592113891819.jpg)
కూలిన పోలీసు కార్యాలయం శ్లాబ్