శవపేటిక మోసిన మాజీ శాసన సభాపతి - MADHUSUDANA CHARI
తనతో పదేళ్లపాటు పనిచేశాడని మాజీ శాసన సభాపతి మధుసూదనాచారి కృతజ్ఞత చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా భాగిర్థిపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన తెరాస కార్యకర్త శవపేటికను మోసి రుణం తీర్చుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం, భాగిర్థిపేట గ్రామంలో నిరుపేదైన తెరాస కార్యకర్త పెండెల ఆనందం మృతి పట్ల మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనతో పది సంవత్సరాల పాటు పనిచేశాడని ఆయన స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఎర్రటి ఎండలో శవపేటికను తన భుజాలపై మోసి కృతజ్ఞతను చాటుకున్నారు. కార్యకర్త కుటుంబ సభ్యులను ఓదార్చి.. అన్ని విధాలుగా తనకు చేతనైన సహాయం అందిస్తానని మధుసూదనాచారి భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: తెలంగాణలో బీర్లకు కరువొచ్చింది..