రానున్న వానాకాలంలో చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాంలను నింపడమే తొలి ప్రాధాన్యతగా భావించాలన్న సీఎం కేసీఆర్ (Cm kcr)... ఆదేశాలతో అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాణహిత నది ప్రవాహం జూన్ 20 తర్వాత ఉద్ధృతంగా మారుతుందని... అప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్లే ఎత్తిపోసి కాళేశ్వరం (Kaleshwaram) రాడార్లో ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాలను నింపుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాలతో...
రూ. 4 వేల కోట్లతో చేపట్టిన చెక్ డ్యాంలలో మొదటి దశను జూన్ 30 వరకు పూర్తి చేసి ఆ తర్వాత నీరు నింపాలని తెలిపారు. ముఖ్యమంత్రి (Cm) ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు కసరత్తు వేగవంతం చేశారు. కాళేశ్వరం (Kaleshwaram)లోకి ప్రవాహాలు ప్రారంభమైన వెంటనే నీటిని ఎత్తిపోసి పరిధిలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలను నింపేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు సహా ఎస్సారెస్పీ పరిధిలోని 4,450 చెరువులను గుర్తించారు. వీటి సామర్థ్యం 44.2 టీఎంసీలు. వీటి సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరంలో వీటిలో 1,205 చెరువులను నింపారు.
10వేల చెరువులు...