సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే ఓసీ-2లో టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు. భూపాలపల్లి సింగరేణిలోని 41 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
భూపాలపల్లిలో టీబీజీకేఎస్ నేతల నిరసన - భూపాలపల్లిలో టీబీజీకేఎస్ నేతల నిరసన వార్తలు
సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
భూపాలపల్లిలో టీబీజీకేఎస్ నేతల నిరసన
సింగరేణిని ప్రైవేటీకరిస్తే కార్మికులు ఇబ్బందులు పడతారని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ మాజీ ఉపాధ్యక్షులు బడితల సమ్మయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. జులై 2న జరిగే 24 గంటల సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.