కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో కరోనాతో మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను స్థానిక టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దగ్గరుండి జరిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మ లక్ష్మీ.. కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచింది.
కొవిడ్‌తో చనిపోయిన మహిళకు అన్నీ తానై..! - jayashankar bhupalapalli covid cases today
కరోనాతో ప్రాణాలు విడిచిన ఓ మహిళ మృతదేహానికి స్థానిక టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అంత్యక్రియలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇది జరిగింది.
Funeral of the corona dead body
విషయం తెలుసుకున్న కొక్కుల తిరుపతి.. కుటుంబానికి అండగా నిలబడి కరోనా నిబంధనల మేరకు దహన సంస్కారాలను నిర్వహించారు.
ఇదీ చదవండి:సౌకర్యాలు ఉన్నా వైద్యుల కొరత.. కరోనా బాధితులకు ఓదార్పు కరవు