తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండున్నర లక్షల విలువైన గుట్కా స్వాధీనం - jayashanker bhupalpally news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో పలు దుకాణాలపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేసి... నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

task force police raids on kirana shops in chityala
task force police raids on kirana shops in chityala

By

Published : Oct 8, 2020, 3:39 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సీసీఎస్​ క్రైమ్​, టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.2 లక్షల 54 వేల విలువచేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

నిషేధిత అంబర్ గుట్కా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మోహన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ్ కుమార్, ఎస్సై గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇళ్లలో చోరీ.. 5 ద్విచక్రవాహనాలు, నగదు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details