Kaleshwaram: కాళేశ్వరం నిర్వాసితుల పరిహారం అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఎంత మందికి ఎంత పరిహారం చెల్లించారో వివరాలతో సహా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తమకు సరైన విధంగా పరిహారం అందలేదంటూ కాళేశ్వరం నిర్వాసితులు సుప్రీంను ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని ఆదేశించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పరిహారంపై కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన నిర్వాసితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాళేశ్వరం పరిహారం ఎంతమందికి చెల్లించారో చెప్పండి: సుప్రీంకోర్టు
18:36 July 11
Kaleshwaram: పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని సుప్రీంను ఆశ్రయించిన నిర్వాసితులు
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. నిర్వాసితుల్లో ఎక్కువ మంది పరిహారం తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. దీనికి పిటిషనర్ల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది నిర్వాసితులు అంగీకరిస్తే ఇంకా సమస్య ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తం అన్ని వివరాలు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
లీవ్ ఇవ్వలేదని జవాన్ సూసైడ్.. 18 గంటలు కుటుంబాన్ని బందీగా చేసుకొని!