తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 9:41 AM IST

ETV Bharat / state

సింగరేణిలో సమ్మె... సంస్థకు కోట్లలో నష్టం

సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు గురువారం సమ్మెకు దిగాయి. బీఎంఎస్ మినహా మిగతా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూసీ, హెచ్ఎంఎస్ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. టీబీజీకేఎస్ సమ్మెకు మద్దతు తెలిపింది. ఇప్పటికే సంఘాలు గనులపై ద్వారా సమావేశాలు నిర్వహించాయి. కరపత్రాల ద్వారా ప్రచారం చేసాయి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి విజయవంతం చేయాలని కోరుతున్నాయి.

Strike in Singareni loss in crores to the company
సింగరేణిలో సమ్మె... సంస్థకు కోట్లలో నష్టం

నేడు సింగరేణిలో జాతీయ సంఘాల సమ్మె నేపథ్యంలో మళ్లీ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కొవిడ్ మూలంగా కార్మికులు 40 శాతం మంది విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ముందుకు పోతున్న కంపెనీకి.. మళ్లీ దేశవ్యాప్త సమ్మెతో ఉత్పత్తికి మరోసారి విఘాతం కలగనుంది.

యాజమాన్యం కార్మికులను విధులకు రావాలని పేర్కొంది. సమ్మెకు దూరంగా ఉండాలని కార్మికులకు సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయని తెలిపింది. 16 మిలియన్ టన్నుల ఉత్పత్తితో వెనుకంజలో ఉన్నామని వివరించింది. సింగరేణి పరిధిలో లేని విషయాలపై సమ్మెలో పాల్గొనడం సబుబు కాదని వెల్లడించింది. సమ్మె చేస్తే కంపెనీకి రూ.58 కోట్లు, కార్మికులు కోల్పోయే వేతనాలు రూ.20 కోట్ల వరకు ఉంటాయని వివరించింది.

ఇదీ చూడండి :తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..!

ABOUT THE AUTHOR

...view details