జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండల కేంద్రంలో ఇంటి నుచి పాఠశాలకు వెళ్తున్న మాచర్ల పవన్(12)అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి - Dogs attacked a boy named Matcharla Pawan (12) who was going to school.
ఓ బాలుడిపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. పాఠశాలకు వెళ్తున్న సమయంలో చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.

బాలుడిపై వీధి కుక్కల దాడి
గ్రామంలో కుక్కల భయం రోజురోజుకు పెరుగుతోంది. రెండవ విడత గ్రామ అభివృద్ధి పథకంలో భాగంగా కుక్కల బెడద లేకుండా చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ప్రజలు అంటున్నారు. గ్రామాల్లో కుక్కలు పెరిగిపోయాయని వాటిని నివారించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి
ఇదీ చూడండి : తప్పుడు పత్రాలతో రుణం... ఎస్బీఐ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు